గ్లోబల్ లీడర్లలో మోదీ అత్యంత స్ఫూర్తిదాయకం: బెల్జియం ప్రధాని ప్రశంసల వర్షం

05-09-2026 Sat 12:16 | National
Advertisement
  • మోదీ తెలివైన నాయకుడన్న బార్ట్ డె వెవర్
  • మోదీతో భేటీ కావడం తనకు లభించిన గౌరవమని వ్యాఖ్య
  • విశ్వవేదికపై భారత్ పాత్ర కీలకంగా మారిందన్న బెల్జియం ప్రధాని
Advertisement

ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రధాని మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానాలు, నాయకత్వ పటిమపై బెల్జియం ప్రధాని బార్ట్ డె వెవర్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన, తెలివైన నేతల్లో మోదీ అగ్రగామి అని అభివర్ణించిన ఆయన... మోదీతో భేటీ కావడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని పలువురు అగ్రనేతల ప్రసంగాలు విన్నప్పుడు ఆందోళన, అభద్రతా భావం కలుగుతాయని... కానీ ప్రధాని మోదీ మాట్లాడితే ఆయన చెప్పిన దార్శనికతను అనుసరించాలనే నమ్మకం, స్ఫూర్తి కలుగుతాయని వ్యాఖ్యానించారు.


విశ్వవేదికపై భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని కొనియాడిన బెల్జియం ప్రధాని... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను బెల్జియం ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, టారిఫ్‌లపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని అస్థిరత వల్ల ప్రపంచ వాణిజ్యమే ప్రమాదంలో పడుతుందని... స్వేచ్ఛా వాణిజ్యం, బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాల ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

Advertisement
Narendra ModiBart De WeverBelgium PM praises ModiIndia Belgium relationsGlobal leadershipIndia fastest growing economy

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more